సీక్రెట్ టాస్క్ అంటే అర్థమేంటి? ఎవరికీ తెలియకుండా టాస్క్ పూర్తి చేయాలి. కానీ అపర చాణక్యుడిలా బిల్డప్ ఇచ్చే శివాజీకి ఈ ముక్క తెలియకపోవడమేంటో! ప్రశాంత్ మిర్చి మొక్కను పోస్ట్ డబ్బాలో దాచేయమని శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే మొక్కను ఎలా దాచేయాలో పక్కనపెట్టి ముందుగా ప్రశాంత్‌ను ఓ గదిలో పెట్టి బంధించాడు. గేమ్‌లో అతడిని చంపేస్తున్నట్లు చెప్పి ఆ తర్వాత తీరికగా మొక్కను దాచాడు.
ఖంగు తిన్న రైతుబిడ్డ
ఎవరికీ ఏ అనుమానం రాలేదేమో కానీ గౌతమ్ మాత్రం ఈజీగా పసిగట్టేశాడు. ప్రశాంత్‌ను డెడ్ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్ అతడిని దెయ్యంలా తెల్లబట్టలు వేసుకుని తిరగమన్నాడు. ఈ క్రమంలో దెయ్యంలా ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్‌ను శివాజీ అన్ననే చంపాడు కదరా నిన్ను అని అడిగేశాడు. అతడి మాటతో ఖంగు తిన్న రైతుబిడ్డ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ తెలివితేటలను మాత్రం సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. పోలీసుల కన్నా ముందే పసిగట్టేశాడని మెచ్చుకుంటున్నారు.
హంతకుడిని పసిగట్టిన గౌతమ్
అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లోనూ హోటల్ మేనేజర్ పాత్రలో ఉన్న శివాజీయే బిగ్‌బాస్ భార్యను హత్య చేసి ఉంటాడని క్లూ ఇచ్చాడు. నిజానికి ప్రశాంత్‌ను డెడ్ చేయాలన్న సీక్రెట్ టాస్క్‌తో పాటు బిగ్‌బాస్ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్ ఇచ్చాడు బిగ్‌బాస్. అటు గౌతమ్ ఆ రెండు పాయింట్లను కరెక్ట్‌గా గెస్ చేసి తనది మాస్టర్‌మైండ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. కాగా మొదటి నుంచీ ఏ గ్రూపులోనూ చేరకుండా సింగిల్‌గా ఆడుతున్నాడు గౌతమ్. శివాజీ తప్పు చేశాడనిపించినప్పుడల్లా ధైర్యంగా ఎదురెళ్తున్నాడు. ఈ లక్షణాలే గౌతమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే ఆట కొనసాగిస్తే అతడు టాప్ 5లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శివాజీ ఇతడిని పిచ్చివాడు అని తీసిపారేశాడు కానీ అతడిని ఎదురించే దమ్మున్నోడు, ఆటలో సత్తా చూపే సరైనోడు అని అభిమానులు గౌతమ్‌ను కొనియాడుతున్నారు.
చదవండి: బిగ్‌బాస్ ఆఫర్, ఖరీదైన కారు గిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క
Comments
Please login to add a commentAdd a comment