బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ బిగ్‌బాస్ చెప్పేదే వేదం.. ఆయన చెప్పింది తు.చ తప్పకుండా పాటించి తీరాల్సిందే! కాదూ, కూడదు నా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తానంటే చెల్లదు. అందులోనూ బిగ్‌బాస్‌కే ఎదురు తిరిగి మాట్లాడటం, అతి చేయడం బిగ్‌బాస్ ఏంటి? ప్రేక్షకులు కూడా సహించరు. ఈరోజు హౌస్‌లో శివాజీ ఓవరాక్షన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
బకెట్‌ను తన్నుతూ ఫైర్ అయిన శివాజీ
కాఫీ పౌడర్ పంపించలేదని ఫ్రస్టేట్ అయ్యాడు శివాజీ. ఆవేశంతో చేతిలో ఉన్న వస్తువును నేలకేసి కొట్టాడు. ఇంకో గంట చూస్తా.. ఎవడికీ భయపడను అంటూ దారిలో ఉన్న బకెట్ వంటి వస్తువులను తన్నుకుంటూ పోతూ చిందులు తొక్కాడు. అయినా సరే బిగ్‌బాస్ శివాజీని ఏమీ అనకుండా అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. గౌతమ్‌కు బీపీ మెషిన్ ఇచ్చి శివాజీ బీపీ ఎంతుందో చూడమన్నాడు. అయినా సరే, శివాజీ తలపొగరుతో.. ఏం బీపీ చూస్తవ్.. పెట్టక్కడ అంటూ గౌతమ్ మీదా అరిచాడు. నీకే బీపీ ఎక్కువైందని బిగ్‌బాస్‌నే తిట్టిపోశాడు. తలుపు తీస్తే మరు క్షణం వెళ్లిపోతానని బిల్డప్ ఇస్తూ మాట్లాడాడు.
తలుపు తీస్తే వెళ్లిపోతా అంటూ వార్నింగ్
అప్పటికీ బిగ్‌బాస్ కూల్‌గానే మాట్లాడుతున్నాడు. పరిస్థితిని చల్లబర్చాలన్న ఉద్దేశంతో రతికకు ఓ చిన్న పని అప్పజెప్పాడు. స్టెతస్కోప్ తీసుకుని అందరి గుండె ఏం చెప్తుందో తెలియజేయాలన్నాడు. కానీ ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు శివాజీ. నేనిక్కడ బాధపడుతుంటే ఆయనకు కామెడీ ఉందా? అందరి హార్ట్‌బీట్ చూసి ఈ శివాజీగాడిని వదిలేసి పిచ్చోడిని చేయాలనుకుంటున్నాడా? అని కన్నెర్ర జేస్తూ.. నాకు ఈ బిగ్‌బాస్ హౌసే వద్దు, తలుపు తీస్తే వెళ్లిపోతా.. అంటూ చిర్రుబుర్రులాడాడు.
ఇంత ఓవరాక్షన్ పనికి రాదు..
ఇది చూసిన జనాలు.. అది సీక్రెట్ టాస్క్ అయితే ఓకే.. కానీ ఇంత ఓవరాక్షన్ పనికిరాదు అని విమర్శిస్తున్నారు. అడిగినవన్నీ చిటికెలో తన ముందుకు రావడానికి ఇదేమీ అతడి సొంతిల్లు కాదని సెటైర్లు వేస్తున్నారు. 'బిగ్‌బాస్ 7 సీజనే ఉల్టాపల్టా అనుకున్నాం కానీ కంటెస్టెంట్లు కూడా ఉల్టా పల్టాగానే ఉన్నారు', 'ఇలా వెళ్లిపోతామని బెదిరించేవాళ్లను నిజంగా పంపిస్తే అప్పుడు తిక్క కుదురుతుంది' అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ప్రమోషన్స్‌కు దూరంగా అనుష్క? అసలు నిజమేంటంటే?
తొక్కని బురదా లేదు.. కడగని కాలూ లేదు..!
Comments
Please login to add a commentAdd a comment