
యమ్ యన్ వి సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ మూవీకి యమ్ యన్ వి సాగర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ని హీరో శివాజీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఈ చిత్రం టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.
దర్శక నిర్మాతలు యమ్ యన్ వి సాగర్ సాగర్ మాట్లాడుతూ, "మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment