సోఫాజీ.. శివాజీ ప‌రువు తీసిన నాగ్‌.. వీళ్లు బంగారం, వాళ్లు బొగ్గు | Bigg Boss 7 Telugu: Nagarjuna Clarify Doubts of Gautham Krishna | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: వెళ్లేముందు తేజ‌ను ఏడిపించిన శోభ‌.. అమ‌ర్ నా ఫ్రెండ్, నువ్వెవ‌రు? అంటూ..

Published Sat, Nov 4 2023 11:09 PM | Last Updated on Sun, Nov 5 2023 11:11 AM

Bigg Boss 7 Telugu: Nagarjuna Clarify Doubts of Gautham Krishna - Sakshi

నాగార్జున‌తో తేల్చుకునే స‌మ‌యం కోసం తెగ ఎదురుచూశారు తేజ‌, గౌత‌మ్‌. ఇద్ద‌రి ఫిర్యాదు శివాజీ గురించే! అయితే ఎప్ప‌టిలాగే శివాజీని వెన‌కేసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశాడు నాగ్‌. గేమ్‌లో దొంగ‌త‌నం చేయ‌బోతే శివాజీ నానామాట‌లు తిట్టి, బెదిరించిన సంగ‌తి తెలిసిందే క‌దా! అదంతా అత‌డి స్ట్రాట‌జీ అని శివాజీకి పాజిటివ్‌గా మాట్లాడారు. దీంతో తేజ‌, గౌత‌మ్ బిక్క‌మొహం వేసుకున్నారు. అటు అశ్విని కూడా గ‌ట్టిగానే క‌ల్ఆస్ పీకాడు నాగ్‌. మ‌రి నేటి(న‌వంబ‌ర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

శివాజీ ఫౌల్ గేమ్స్‌.. ఒప్పుకున్న యావ‌ర్‌
ఎప్పుడూ ప్ర‌శాంత్‌, యావ‌ర్ జ‌పం చేసే శివాజీ కెప్టెన్సీ టాస్కులో యావ‌ర్‌కు స‌పోర్ట్ చేయ‌లేదు. అలా అని త‌న చేయి బాలేద‌ని ఆడ‌కుండా కూర్చోలేదు. ఆడి దెబ్బ త‌గిలితే అది సింప‌తీ కింద వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆలోచించాడు. ఎలాగో ఓడిపోయే గేమ్‌కు యావ‌ర్ త‌ర‌పున ఎందుక‌ని అర్జున్‌కు స‌పోర్ట్ చేస్తూ అత‌డి త‌ర‌పున గేమ్‌ ఆడాడు. ఇది యావ‌ర్‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. నాకోసం ఎందుకాడ‌లేదు? అని నిల‌దీశాడు. అంతేకాదు అశ్విని ద‌గ్గ‌ర కూడా శివాజీ అన్న ఫౌల్ గేమ్ ఆడాడ‌ని అస‌హనానికి లోన‌య్యాడు.

తేజ‌ను ఏడిపించిన శోభ‌
మ‌రోవైపు శోభా శెట్టి-తేజ వాష్‌రూమ్ ఏరియాలో గొడ‌వ‌ప‌డ్డారు. అమ‌ర్ నా స్నేహితుడు కాబ‌ట్టి కెప్టెన్సీ టాస్క్‌లో స‌పోర్ట్ చేశాడు.. నువ్వెవ‌రివి అస‌లు? మా ఇద్ద‌రి మ‌ధ్య పుల్ల‌లు పెడుతున్నావు.. నీ ఒరిజిన‌ల్ క్యారెక్ట‌ర్ ఇప్పుడు తెలుస్తుంది.. అని ఆవేశంతో బుస‌లు క‌క్కింది. త‌న మాట‌ల‌తో క‌ల‌త చెందిన తేజ ఒంట‌రిగా ఏడ్చాడు. అనంత‌రం జ‌పాన్ ప్ర‌మోష‌న్స్ కోసం కార్తీ బిగ్‌బాస్ స్టేజీ మీదకు వ‌చ్చాడు.  ఎప్పుడూ పొగుడుతూ ఉంటే నాగ్ ఈసారి కంటెస్టెంట్ల‌పై సెటైర్లు వేస్తూ కార్తీకి ప‌రిచ‌యం చేశాడు. అశ్విని పుల్ల‌లు పెడుతుంద‌ని, ప్ర‌శాంత్ అప‌రిచితుడు అని, శోభ అపార్థం చేసుకుంటుంద‌ని, తేజ ప‌క్క‌వారి బాధ‌ను రెట్టింపు చేస్తాడ‌ని, శివాజీ సోఫాజీ(సోఫాకే అతుక్కుపోయాడ‌ని) అని మాట్లాడాడు. కాసేపు క‌బుర్లాడాక కార్తీని పంపించేశాడు నాగ్‌.

శివాజీని వెన‌కేసుకొచ్చిన నాగ్‌
ఇక బాల్స్ టాస్కులో శివాజీ దొంగ‌త‌నం చేయ‌కూడ‌ద‌ని వాదించాడు. దాదాపు హౌస్ అంతా అత‌డి పెద్ద‌రికానికి గౌర‌వ‌మిచ్చి దొంగ‌త‌నం ప్ర‌య‌త్నం విర‌మించుకుంది. అలా దొంగ‌త‌నాన్ని ఆప‌డ‌మ‌నేది శివాజీ స్ట్రాట‌జీ అని నాగ్ క‌వ‌ర్ చేశాడు. దొరికిందే ఛాన్స‌ని శివాజీ కూడా అవును, అది నా స్ట్రాట‌జీ అంటూ ఎగిరెగిరి ప‌డ్డాడు. కెప్టెన్సీ టాస్క్‌లో శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి న‌న్ను గేమ్ నుంచి త‌ప్పించాల‌ని చూశాడంటూ నాగ్‌కు ఫిర్యాదు చేశాడు గౌత‌మ్‌. అశ్విని కూడా అదే చెప్పింద‌న్నాడు. నిజంగానే శివాజీ.. అంద‌రినీ ఇన్‌ఫ్లూయెన్స్ చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి గౌత‌మ్‌ను ఎలిమినేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడా? అని ఇంటిస‌భ్యుల‌ను నాగ్ అడిగాడు. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని హౌస్ ముక్త‌కంఠంతో చెప్పింది. దీంతో గౌత‌మ్ త‌న‌కు క్లారిటీ వ‌చ్చింద‌న్నాడు.

వీళ్లు బంగారం.. వాళ్లు బొగ్గు
త‌ర్వాత హౌస్‌లో ఎవ‌రెలా గేమ్‌ ఆడార‌నేదాన్ని బ‌ట్టి వారి ఫోటోల‌ను బంగారం/మ‌ట్టి /బొగ్గు టేబుల్‌లో అతికించాడు. గౌత‌మ్‌ను బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించిన నాగ్ అత‌డిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ‌, అమ‌ర్‌, అర్జున్‌ను, శివాజీల‌ను సైతం బంగారం లైన్‌లో పెట్టాడు. భోలెను గేమ్‌లో స్వాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడ‌ని అత‌డిని బొగ్గు బోర్డులో పెట్టాడు. ర‌తిక, అశ్విని గేమ్ ఆడ‌లేద‌ని వారిని కూడా బొగ్గు కేట‌గిరీలో వేశాడు. ఆట‌పై ఫోక‌స్ చేయ‌లేదంటూ యావ‌ర్‌ను మ‌ట్టి కేట‌గిరీలో పెట్టాడు. తేజ కోసం బాగా ఆడావు, కానీ నీకోసం ఆడంటూ ప్రియాంక‌ ఫోటోను మ‌ట్టిలో పెట్టాడు.

మ‌ధ్య‌లో దూరిన శివాజీ
ప్ర‌శాంత్‌ను బంగారంలో పెట్ట‌డంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. మాటిమాటికీ ఏడుస్తావ్‌.. సింప‌తీనా? అని అడ‌గ్గా వెంట‌నే శివాజీ మ‌ధ్య‌లో దూరుతూ.. అత‌డి స్వ‌భావ‌మే అంత‌.. అని స‌పోర్ట్ చేశాడు. ఈరోజు క్లాసులు తీసుకోవ‌డం మీదే ఫోక‌స్ పెట్టిన నాగ్ ఎవ‌రినీ సేవ్ చేయ‌కుండానే వెళ్లిపోయాడు. అయితే ఈ వారం తేజ ఎలిమినేట్ కానున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి అదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాలంటే రేప‌టి ఎపిసోడ్ చూడాల్సిందే!

చ‌ద‌వండి: శోభ సేఫ్‌, తేజ ఎలిమినేట్‌.. చేసిన పాపం ఊరికే పోతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement