బిగ్‌బాస్‌ 7: ఏడ్చేసిన శివాజీ.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే? | Bigg Boss 7 Telugu: Sivaji Shares his Pain With Bigg Boss, Arjun Becomes New Captain | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: చేయి నొప్పితో ఏడ్చేసిన శివాజీ, కొత్త కెప్టెన్‌ అతడే!

Published Fri, Oct 20 2023 3:15 PM | Last Updated on Fri, Oct 20 2023 4:12 PM

Bigg Boss 7 Telugu: Sivaji Shares his Pain With Bigg Boss, Arjun Becomes New Captain - Sakshi

అశ్వినిని గేమ్‌ నుంచి తప్పించగా పూజా మూర్తి.. ప్రశాంత్‌ ఫోటో నీళ్లలో పడేసింది. ప్రిన్స్‌ యావర్‌.. ప్రియాంక ఫోటోను నీళ్లలో పడేశాడు. అమర్‌దీప్‌.. శివాజీ ఫోటో పడేశాడు. దీం

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రహాంతరవాసులు రావడం, కొన్ని టాస్కులు ఇవ్వడం, కంటెస్టెంట్లు పోటీపడి ఆడటం చూస్తూనే ఉన్నాం. గ్రహాంతర వాసులు ఇచ్చిన గేమ్‌లో జిలేబిపురం టీమ్‌ గెలిచింది. దీంతో ఆ టీమ్‌లో ఉన్న ప్రియాంక, అర్జున్‌, అశ్విని, ప్రశాంత్‌, సందీప్‌, శివాజీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

గులాబీపురం కంటెస్టెంట్లు.. కెప్టెన్సీకి అర్హత లేదనుకునేవారి ఫోటోలను స్విమ్మింగ్‌ పూల్‌లో పడేసి పోటీ నుంచి తొలగించాలన్నాడు. ఈ క్రమంలో శోభ.. అశ్వినిని గేమ్‌ నుంచి తప్పించగా పూజా మూర్తి.. ప్రశాంత్‌ ఫోటో నీళ్లలో పడేసింది. ప్రిన్స్‌ యావర్‌.. ప్రియాంక ఫోటోను నీళ్లలో పడేశాడు. అమర్‌దీప్‌.. శివాజీ ఫోటో పడేశాడు. దీంతో చివరగా అర్జున్‌, సందీప్‌ మాత్రమే మిగిలారు.

నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అర్జున్‌ ఈ వారం ఇంటి కెప్టెన్‌గా అవతరించినట్లు కనిపిస్తోంది. ఇకపోతే శివాజీని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌.. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. దీంతో ఎమోషనలైన శివాజీ ఇప్పటికీ చేతినొప్పితో ఇబ్బందిపడుతున్నట్లు తెలిపాడు. అందరి ముందు ఏడ్వలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చదవండి: ఐ లవ్యూ చెప్పిన తేజ.. థూ అని ఊసిన శోభ.. చులకనవుతున్న అమర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement