Bigg Boss 7: ఆరోగ్యంతో చెలగాటం.. శోభాశెట్టికి అలాంటి పరిస్థితి! | Bigg Boss 7 Telugu Latest Promo Shobha Shetty Nausea | Sakshi
Sakshi News home page

Shobha Shetty Bigg Boss 7: వింత టాస్క్.. దెబ్బకు బాత్రూంకి పరుగెత్తిన శోభా!

Nov 16 2023 7:42 PM | Updated on Nov 16 2023 11:46 PM

Bigg Boss 7 Telugu Latest Promo Shobha Shetty Nausea - Sakshi

బిగ్‌బాస్ షో సంగతేమో గానీ.. ఆర్గనైజర్స్ పెడుతున్న కొన్ని టాస్కులు ఆయా కంటెస్టెంట్స్ ప్రాణాల మీదకొస్తున్నాయి. తాజాగా తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్‌లో అలాంటి ఓ సంఘటన జరిగింది. ఎవిక్షన్ పాస్ కోసం బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ అందులో ఆడిన శోభాశెట్టి మాత్రం.. గెలవాలనే ఊపులో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. దీంతో అందరూ భయపడిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది?

బిగ్‌బాస్ 7వ సీజన్ ప్రస్తుతం 11వ వారానికి వచ్చేసింది. దీంతో ఎవరికి వాళ్లు కప్ కొట్టడమే టార్గెట్‌గా టాస్కుల్లో పోటీపడుతున్నారు. ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ కోసం కాకుండా ఎవిక్షన్ పాస్ కోసం రకరకాల టాస్కులు పెడుతున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో భాగంగా అర్జున్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నట్లు చూపించారు. కానీ ​తర్వాత టాస్కులో యావర్ గెలిచి.. ఆ పాస్ చేజిక్కుంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. టెన్షన్‌లో ఆ కంటెస్టెంట్‌)

గురువారానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో ప్రశాంత్‌తో పోటీపడిన యావర్, తన ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకున్నాడు. ఇకపోతే 'ఐ లవ్ బర్గర్' అనే టాస్కులో భాగంగా శోభాశెట్టితో పోటీపడ్డాడు. ఈ గేమ్‌లో యావర్ పర్లేదు గానీ శోభాశెట్టి మాత్రం తెగ ఇబ్బంది పడింది. ఓవైపు గేమ్ ఆడుతూ, మరోవైపు బర్గర్ తిన్నప్పటికీ ఊపిరి అందలేదు. దీనికి తోడు కడుపులో తిప్పేసింది. దీంతో బాత్రూమ్‌కి పరుగెత్తి వాంతి చేసుకుంది.

అయితే ఇలాంటి గేమ్స్ కరెక్ట్‌గా ఆడితే పర్లేదు గానీ కాస్త నెమ్మదిగా తినే కంటెస్టెంట్స్.. ఇలాంటి పోటీల్లో పాల్గొంటే ఎటొచ్చి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదముందని ప్రోమో చూస్తుంటే భయమేసింది. అయితే బాత్రూంలో వాంతి చేసుకున్న శోభాశెట్టి.. పరిస్థితి ఇప్పుడు ఓకేనా లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

(ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement