బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్‌తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టాపల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే ఆస్కారం ఉంది. ఇకపోతే ఈరోజు మండే అంటే బిగ్‌బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య మంటపెట్టే రోజు.
నీ కాళ్లు పట్టుకోవాలా?
తాజాగా నామినేషన్స్‌పై బిగ్‌బాస్ ప్రోమో వచ్చేసింది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నావంటూ రతిక శివాజీతో వాదనకు దిగింది. నేను లేకపోతే నాగార్జున వీడియోలు వేసి చూపిస్తే నీ పరిస్థితేంటి? అని ప్రశ్నించాడు తిరిగి ప్రశ్నించాడు శివాజీ. అయినా మెట్టు దిగని రతిక ఇంకా సాగదీయడంతో ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా? అని అడిగాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
జడ్జిలు ఏకీభవిస్తేనే నామినేషన్
మరోవైపు బిగ్‌బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టాడు. పవరాస్త్ర గెలుచుకుని హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందిన శోభా, శివాజీ, సందీప్‌లను జ్యూరీ సభ్యులిగా నియమించాడు. ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిని బోనులో నిలబెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు ఆ జడ్జిలకు సమ్మతంగా అనిపిస్తే అవతలివారు నామినేట్ అవుతారు.
తేజ, ప్రియాంకను నామినేట్ చేసిన ప్రిన్స్
ముందుగా ప్రిన్స్ యావర్.. ఫెమినిజాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరమ్మాయిలు నన్ను ఆటలో నుంచి తప్పించారంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. కానీ ఇందుకు జడ్జి శోభా ఒప్పుకోలేదు. ఇద్దరమ్మాయిలున్నారు కాబట్టి త్యాగం చేస్తానని నువ్వు తేజతో అన్నావా? లేదా? అని నిలదీసింది. దీనికి ప్రిన్స్.. అది వేరే విషయమని.. అందరి ముందు చెప్పినదాని గురించి తాను మాట్లాడుతున్నానని వాదించాడు. తర్వాత తేజను సైతం నామినేట్ చేశాడు.
బయట సెలబ్రిటీ గురించి ఎందుకు?
అటు శుభశ్రీ సైతం కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. ఈ హౌస్‌లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని వ్యక్తి, ఓ సెలబ్రిటీ గురించి పదేపదే మాట్లాడటం తప్పని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం గౌతమ్, ప్రిన్స్, శుభశ్రీ, తేజ, రతిక, ప్రియాంక నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: బిగ్‌బాస్: దామిని అవుట్.. వెళ్తూ వెళ్తూ ఆ సర్‌ప్రైజ్
Comments
Please login to add a commentAdd a comment