పిచ్చోడంటూ తిట్టిన శోభ.. ఉగ్రరూపం దాల్చిన ప్రిన్స్‌ | Bigg Boss Telugu 7: Hot Chili Task for Next Week Captaincy - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ప్రిన్స్‌ యావర్‌ను పిచ్చోడని తిట్టిన శోభ.. మళ్లీ అంటా.. ఏం చేస్తావంటూ రెచ్చగొడుతూ..

Published Fri, Oct 27 2023 12:15 PM | Last Updated on Fri, Oct 27 2023 12:57 PM

Bigg Boss Telugu 7: Hot Chilli Task for Next Week Captaincy - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ప్రేమానురాగాలు, రాగద్వేషాలు, ఆప్యాయతలు, కలతలు- కలహాలు.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఈ సీజన్‌లో మాత్రం రాగద్వేషాలు, కలతలు, కలహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటలో పోట్లాటలను స్పోర్టివ్‌గా తీసుకోకుండా అనవసర కోపాలకు, గొడవలకు పోతున్నారు. మరీ ముఖ్యంగా శోభా శెట్టి ప్రతిదానికి చిటపటలాడుతోంది. మోనితలా మారుతున్నావు అని అటు భోలె, ఇటు నాగార్జున హెచ్చరిస్తున్న తన తీరు మార్చుకోవడం లేదు. మోనితలా మారడం కాదు తన అసలు స్వభావం మోనితయే అన్నంత విచిత్రంగా ప్రవర్తిస్తోంది.

అతిగా ఆశపడటం, ఆవేశపడటం..
ఆటలో తను మాత్రమే కష్టపడుతుందని భావించడం.. ఏ ఛాన్సయినా తనకు మాత్రమే దక్కాలని అతిగా ఆశపడటం, ఆవేశపడటం.. లేదంటే అవతలివారి మీదకు గయ్యిమని లేవడం.. ఇలా ఒకదాని మీద ఇంకోటి తప్పులు చేసుకుంటూ పోతూ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ మరోసారి సైకో మోనితలా మారింది శోభ. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్‌ ఈ మిర్చి చాలా హాట్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్లలో ఎవరు కెప్టెన్‌ అవుతారనేది మిగతా ఇంటిసభ్యులు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పాడు.

చిందులు తొక్కిన శోభ
ముందుగా అమర్‌.. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకు కెప్టెన్సీ అవసరం నీకన్నా ఎక్కువ ఉందంటూ ప్రశాంత్‌ మెడలో మిర్చి మాల వేశాడు. భోలె షావళి.. ప్రియాంక మెడలో మిర్చిమాల వేశాడు.  రతిక రోజ్‌, ప్రిన్స్‌.. శోభా శెట్టికి దండేశారు. ఇంకేముంది... ఆ మిర్చి ఘాటు శోభ నషాళానికి ఎక్కింది. నన్నే కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తారా? అని బుసలు కొట్టింది. బక్వాస్‌ రీజన్స్‌.. ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు నీక్కూడా వస్తుంది.. అప్పుడు నేను మాట్లాడతా.. పిచ్చోడు అని తిట్టేసింది.

ప్రిన్స్‌ను పిచ్చోడనేసింది..
నన్ను పిచ్చోడు అంటున్నావా? అని ప్రిన్స్‌ అడగ్గా.. మళ్లీ మళ్లీ అంటా.. ఏం చేస్తావ్‌? అని రెచ్చగొట్టింది. పిచ్చోడినా నేను? అని ప్రిన్స్‌ శోభా మీదకు వెళ్లి అరిచి మిర్చి దండను నేలకేసి కొట్టాడు. భోలె.. తనను మెంటల్‌ హాస్పిటల్‌కు పంపించాలని అన్నందుకు అతడిని జీవితంలో క్షమించనంది శోభా. మరి ఇప్పుడు ప్రిన్స్‌ యావర్‌ను పిచ్చోడు అనడం అసలు సమంజసమేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటి కొత్త కెప్టెన్‌గా గౌతమ్‌ అవతరించినట్లు తెలుస్తోంది.

చదవండి: స్కంద ఓటీటీ రిలీజ్‌ వాయిదా.. రామ్‌ ఫ్యాన్స్‌కు నిరాశ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement