
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 1,085 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 89,746గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 56,46,011గా ఉండగా.. యాక్టీవ్ కేసులు 9,68,377గా ఉన్నాయి. చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,87,613గా ఉండగా వైరస్ బారిన పడి దేశంలో మొత్తం మృతి చెందినవారి సంఖ్య 90,020కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.25 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 17.15 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.59 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 9,53,683 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు 6,69,79,462 పరీక్షలు చేశారు. (చదవండి: రష్యా నుంచి రెండో కరోనా వ్యాక్సిన్)
Comments
Please login to add a commentAdd a comment