సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,299 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,282కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 38,98,829కి చేరింది. (చదవండి: కరోనాతో కొత్తముప్పు !)
Comments
Please login to add a commentAdd a comment