సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంటే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజు భారీగా కేసులు పెరిగాయి. సోమవారం 1052 కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా 1520 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు వెయ్యికి చేరువలో వెలుగు చూశాయి. జీహెచ్‌ఎంసీలో 979, మేడ్చల్ జిల్లాలో 132, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిలెన్ విడుదల చేసింది. 42,531 కరోనా టెస్టులు చేశామని పేర్కొంది.
చదవండి: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం
తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,034కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 209 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 144 ఒమిక్రాన్ కేసులున్నాయి.
చదవండి: నీ కోసమే జైలుకు వెళ్లిన కేసీఆర్: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment