సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,961 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,130 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 93,356 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,581గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,03,299గా ఉండగా.. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399కి చేరింది. కోవిడ్ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 87,882కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 79.68 శాతంగా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 18.72 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 7,31,534 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు మొత్తం 6,43,92,594 కోవిడ్ పరీక్షలు చేశారు. (చదవండి: చలికాలంలో చుక్కలే..!)
Comments
Please login to add a commentAdd a comment