సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,052 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,141 మంది మృతి చెందగా దేశ వ్యాప్తంగా 81,177 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,571గా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 9,70,116గా ఉంది. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47,56,164గా ఉండగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 92,290కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రెటు 81.74 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 16.67 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.59 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 14,92,409 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా...ఇప్పటి వరకు 6,89,28,440 టెస్టులు చేశారు. (చదవండి: రికవరీ రేటు పైపైకి)
Comments
Please login to add a commentAdd a comment