
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. శనివారం ఒక్కరోజే 546 మందికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్–19 కేసుల సంఖ్య 7,072కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 యాక్టివ్ కేసులుండగా, 3,506 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండొందలు దాటింది. శనివారం కరోనా వైరస్ ప్రభావంతో ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 203కు చేరింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్‌లో 13, జనగామలో 10, మేడ్చల్ జిల్లాలో 6, మహబూబ్‌నగర్‌లో 3, వరంగల్ రూ రల్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది.
హోంమంత్రి గన్‌మాన్‌కు కరోనా పాజిటివ్
రసూల్‌పురా(హైదరాబాద్):హోంమంత్రి మహమూద్ అలీ గన్‌మాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. గన్‌బజార్‌లో నివాసముండే ఇతను ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. గన్‌మాన్ కుమార్తె (22)లోనూ వ్యాధి లక్షణాలు ఉండటంతో ఆమెకు కూడా వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment