ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 36 మంది కరోనాతో మృతి చెందారు. ఇక 3,081 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 2,25,796కు చేరుకోగా.. మొత్తంగా 4,806 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,91,203గా నమోదైంది. ప్రస్తుతం అక్కడ 29,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేజ్రీవాల్ సర్కారు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: మంగళగిరి ఎయిమ్స్‌కు 5 అమెరికన్ వెంటిలేటర్లు)
22 లక్షలు దాటిన టెస్టుల సంఖ్య
ఢిల్లీలో ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 1560గా ఉంది. ఇక కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తంగా 22,46,985 పరీక్షలు నిర్వహించారు. నేడు 10,398 ఆర్‌టీపీసీఆర్ టెస్లులు నిర్వహించగా.. రాపిడ్ టెస్టుల సంఖ్య 52,271గా నమోదైంది. ప్రతి మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ ల సంఖ్య 1,18,262. ఇక దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 16,576గా ఉండగా.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 14,482గా ఉంది.(చదవండి: దేశంలో కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment