
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 43,70,129కి చేరింది. ప్రస్తుతం కరోనా కేసుల ప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,115 మంది చనిపోగా.. 74,894 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,97,394యాక్టీవ్ కేసులు ఉండగా.. 33,98,884 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 73,890. కరోనా రోగుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 20.53 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.69 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,54,549 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపగా.. ఇప్పటివరకు మొత్తం 5,18,04,677 పరీక్షలు నిర్వహించారు.
ఇక మహమ్మారి నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఐక్యరాజ్య సమితి ఏజేన్సీలు మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ మాట్లాడుతూ.. ‘కరోనా కట్టడి కోసం భారత ప్రభుత్ర నేత్రుత్వంలోని ఆరోగ్య, సామాజిక ఆర్థిక ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాలను రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనాటా డెసల్లియన్ నేతృత్వంలో ఇవి కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. (చదవండి: నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్–2 ట్రయల్స్ షురూ )
.
Comments
Please login to add a commentAdd a comment