సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 59,410నమూనాలు పరీక్షించగా 295పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,84,171కు చేరింది. కొత్తగా ఒకరు కరోనా బారిన పడి మృతి చెందడంతో 7,126 కి చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 368మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment