సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఈ వేరియంట్ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని ఆయన వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,17,893కు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment