న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు దేశంలో పాటిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 627 మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు 3,47,443 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల ఆరు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 4,92,327కు చేరింది.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో ప్రస్తుతం 21 లక్షల 5వేల 611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 164.44 కోట్ల వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో వ్యాక్సినేషన్, కరోనా తాజా పరిస్థితులపై కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణ, అండమాన్&నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
Comments
Please login to add a commentAdd a comment