South Korea is battling fresh Covid-19 outbreaks: చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ దడ పుట్టిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదే తరహాలో ఈ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రోజువారిగా 4 లక్షల కేసుల రికార్డును నమోదు చేసింది. గతేడాది కరోనా మొదటి వేవ్‌లోని కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం. ఈ తాజా కేసులతో ఇప్పుడు దక్షిణ కొరియాలో సుమారు 7,629,275కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడాసీఏ) బుధవారం పేర్కొంది. అంతేకాదు గత 24 గంటల్లో దాదాపు 293 మరణాలు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పుడు చైనా తర్వాత దక్షిణ కొరియా ఈ కరోనా వ్యాప్తితో అతలాకుతలం అవుతోంది.
చైనాలోని 13 నగరాల్లో కఠిన ఆంక్షలు
మరోవైపు చైనా కూడా మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ దేశం ఎదుర్కొంటోంది. జీరో కొవిడ్ స్ట్రాటజీ విఫలమవ్వడమే కాక కనివినీ ఎరుగని రీతిలో కేసులు పెరిగుపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే 5,280 కేసుల్ని నమోదు చేసింది. అది బుధవారం నాటికి మొత్తం కరోనా కేసుల్లోని మూడొంతులకు పైగా కొత్త కరోనా కేసుల రికార్డును నమోదు చేసింది. దీంతో చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్లో 3 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది
అంతేగాక ప్రావిన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చాంగ్‌చున్‌తో సహా అక్కడి అనేక నగరాల్లోని దాదాపు మూడు కోట్ల మంది నివాసితులు హోం క్యారంటైన్‌లో ఉన్నారని వెల్లడించింది. అంతేకాదు అతిపెద్ద నగరం షాంఘైలో కొద్ది మొత్తంలో ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్ విధించింది. దీంతో నగరంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి, ప్రజా రవాణాను నిలిపివేశారు. మరోవైపు ప్రపంచంలోని చాలా దేశాలు సాధారణ స్థతికి చేరుకుంటుంటే తమ దేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున చైనా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలామణి అవుతున్న చైనాలోఇప్పుడూ ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతేగకా హాంకాంగ్ స్టాక్ మార్కెట్ మూడు శాతానికి పైగా పడిపోయిందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌కు చెందిన టామీవు బ్రీఫింగ్ తెలపింది. చైనా తన మునుపటి జీడిపీ వృద్ధి రేటు 5.5 లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మిగతా దేశాల కంటే చాలా కఠినతరమైన ఆంక్షలు విధించనప్పటికీ అవన్ని విపలమై ఈ రేంజ్ కేసులు పెరగడం ఒకరకంగా దురదృష్టమనే చెప్పాలి.
(చదవండి: కరోనా మళ్లీ విజృంభణ.. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు! భారత్‌లోనూ కరోనా మరణాలపై ఆందోళన!)
Comments
Please login to add a commentAdd a comment