న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ అమాంతం పెరుగుతోంది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. దేశంలో తాజాగా కొత్త కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 19,35,180 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 3,17,532 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. బుధవారం రోజు491 మంది మృత్యువాతపడ్డారు.
కిందటి రోజుతో పోలిస్తే 12శాతం ఎక్కువ నమోదయ్యాయి. దేశంలో 8 నెలల తర్వాత రోజువారీ కేసులు 3 లక్షలు దాటడం ఇదే తొలిసారి. చివరిసారిగా సెకెండ్ వేవ్ సమయంలో గతేడాది మే 15న 3,11,077 రోజువారీ కేసులు నిర్ధారణ అయ్యాయి.
పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 4,87,693 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9,287కు పెరిగింది.
చదవండి: మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్
Comments
Please login to add a commentAdd a comment