
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రంలో 97,113 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,980 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.38 లక్షలకు చేరుకున్నాయి. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 2,398 మంది కోలుకోగా, 7.01 లక్షల మంది రికవర్ అయ్యారని తెలిపారు. ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు చనిపోగా ఇప్పటివరకు 4,075 మంది మృతిచెందారన్నారు. ప్రస్తుతం 33,673 క్రియాశీలక కరోనా కేసులున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment