India New Covid Cases Last 24 Hours: India Report 282970 COVID Cases In A Day - Sakshi
Sakshi News home page

Corona: ముంచుకొస్తున్న ముప్పు.. 248 రోజుల తర్వాత అత్యధిక కేసులు

Published Wed, Jan 19 2022 10:42 AM | Last Updated on Wed, Jan 19 2022 11:45 AM

Corona Update: India Report 282970 COVID Cases In A Day - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 248 రోజుల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక నిన్నటితో పోలిస్తే 18 శాతం అంటే 44,889 కేసులు పెరిగాయి. మంగళవారం రోజు వైరస్‌ కారణంగా 441మంది  ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజే 1,88,157 మంది కోలుకున్నారు.
చదవండి: డాక్టర్‌కే ఐదు డోసుల వ్యాక్సిన్‌! దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 14.43 శాతం నుంచి 15.13 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 93.88శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3 కోట్ల 79 లక్షల మంది కరోనా బారిన పడగా.. 4,87.202 మంది మరణించారు. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు తగ్గుముఖం పట్టినా.. కర్నాటక, కేరళలో కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు 8,961 చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
చదవండి: రసవత్తరంగా యూపీ ఎన్నికల సమరం.. అసెంబ్లీ బరిలో అఖిలేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement