XE Covid Variant, సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ‍్య తగ్గుముఖం పడుతోంది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, పలు దేశాల్లో మాత్రం కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. చైనా, యూకే వంటి దేశాల్లో కరోనా కారణంగా లాక్‌డౌన్ సైతం విధిస్తున్నారు. తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్‌ఈ స్ట్రెయిన్ తొలి కేసు నమోదు కావడం అందరినీ టెన్షన్‌కు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ల పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. ఎక్స్‌ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. కానీ, వైరస్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేశంలో ఒకేసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ కొత్త స్ట్రెయిన్ ఎక్స్‌ఈ కేసులు గుజరాత్, మహారాష్ట‍్రలో నమోదు అయ్యాయి. దీంతో అధికారులు అప‍్రమత్తమయ్యారు. అంతకు ముందు ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ బీఏ.2 వేరియంట్ కంటే ఇది పదిశాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.
Omicron giving rise to many new variants. It is of X series like XE & others. These variants will keep on occurring. Nothing to panic about... At the moment from Indian data it doesn’t show a very rapid spread: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/fu5E3QmdoJ
— ANI (@ANI) April 11, 2022
Comments
Please login to add a commentAdd a comment