
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,06, 064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.2 శాతం తక్కువ నమోదయ్యాయి. ఆదివారం 439 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,848కు పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కేసులొచ్చాయి. ఆ తరువాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
చదవండి: సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్
రోజువారీ పాజిటివిటి 17.07 శాతం నుంచి 20.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22 లక్షల 49వేల 335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.07గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
చదవండి: లక్షల్లో కేసులు.. ఒమిక్రాన్‌పై ఇన్సాకాగ్ కీలక అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment