Megastar Chiranjeevi Changes His Twitter Account Name - Sakshi
Sakshi News home page

Chiranjeevi : ట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చిన చిరంజీవి.. రామ్‌చరణ్‌ స్పెషల్‌ వీడియో వైరల్‌

Published Sat, Apr 16 2022 3:23 PM | Last Updated on Sat, Apr 16 2022 6:47 PM

Chiranjeevi Changed His Twitter Account Name - Sakshi

సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. వ్యక్తిగత, సినిమా విషయాలను తెలియజేయడంతో పాటు ప్రతి పండగకు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అందుకే అతి తక్కువ సమయంలోనే ట్విటర్‌లో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య 1.3 మిలియన్స్‌కి చేరింది.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా పేరును మార్చాడు. చిరంజీవి కొణిదెల అని ఉండే తన ట్విటర్‌ అకౌంట్‌ నేమ్‌ను ‘ఆచార్య’గా మార్చుకున్నాడు. ఇది ఆయన తాజాగా నటించిన సినిమా పేరు. ఈ నెల 29న ఈ మూవీ థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తన ట్విటర్‌ ఖాతాకు ‘ఆచార్య’అని పేరు మారుస్తూ రామ్‌చరణ్‌కు సంబంధించిన ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.


మెగాస్టార్‌ చిరంజీవి స్వతహా ఆంజనేయస్వామి భక్తుడు. నేను హనుమాన్‌ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ  ఆ వీడియోని షేర్‌ చేశాడు. అందులో కాటేజీలో రామ్‌ చరణ్‌ మేకప్‌ వేసుకుంటుండగా, ఓ వానరం అక్కడకు వచ్చింది. చరణ్‌ మేకప్‌ వేసుకోవడం అయిపోగానే.. ఆ వానరానికి బిస్కెట్లు ఇచ్చాడు. అది సోఫాపైకి ఎక్కి చక్కగా బిస్కెట్లను తినింది. ఆ వీడియోకి  ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ అనే స్లోకాన్ని నేపథ్య సంగీతంగా యాడ్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement