
Acharya Movie Neelambari Second Song Out: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(నవంబర్ 5) సెకండ్ సింగిల్ పేరుతో పూజ హెగ్డేపై సాగే ‘నీలాంబర్’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. దీనితో పాటు సాంగ్ మేకింగ్ సీన్స్‌తో వీడియోను వదిలారు.
చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం!
'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతన్న ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. నిన్న(నవంబర్ 4) దీపావళి సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ ఫుల్ లిరికల్ సాంగ్ నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో రామ్ చరణ్‌కు జోడిగా పూజ నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రి నక్సలైట్‌గా నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది.
చదవండి: దీపావళి సర్‌ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment