
ఈ సినిమా టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ భారీ చిత్రం తాలుకా టీజర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ భారీ చిత్రం తాలుకా టీజర్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేస్తూ..‘తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని’ చిత్రబృందం తెలియజేసింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత అందించాడు.