
ఆకివీడు: సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని మండలంలోని కళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ (గెటప్ శ్రీను) అన్నా రు. స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతోన్న ‘లైగర్’ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారు. చిరంజీవి ఆచార్య చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రాజూ యాదవ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నానన్నారు. ఖైదీ నెం.150, జాంబీ రెడ్డి చిత్రాల్లో పాత్రలకు పేరువచ్చిందన్నారు.
చదవండి: చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1
చదవండి: చిరంజీవీ సరసన త్రిష
Comments
Please login to add a commentAdd a comment