Chiranjeevi Acharya Movie First Review Out: Rating By Umair Sandhu Goes Viral - Sakshi
Sakshi News home page

Acharya Movie First Review: ఆచార్య సినిమా ఫస్ట్‌ రివ్యూ, రామ్‌చరణ్‌ బాస్‌, మరి చిరంజీవంటారా?

Published Wed, Apr 27 2022 11:16 AM | Last Updated on Wed, Apr 27 2022 1:51 PM

Acharya Movie First Review Rating By Umair Sandhu - Sakshi

అంతేకాదు ఈ చిత్రానికి నాలుగు స్టార్ల రేటింగ్‌ కూడా ఇచ్చాడు. ఇందులో రామ్‌చరణ్‌ బాస్‌ అయితే చిరంజీవి టెర్రిఫిక్‌గా కనిపించారని ప్రశంసించాడు. ఈ సినిమాలో చరణ్‌ తన పాత్రతో స్టార్‌ పవర్‌ను

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్‌ చేస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 29న) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఆచార్య సినిమా అదుర్స్‌ అంటూ అప్పుడే ఓ రివ్యూ బయటకు వచ్చింది.

ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్‌ సంధు ఆచార్య చూసేశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రానికి నాలుగు స్టార్ల రేటింగ్‌ కూడా ఇచ్చాడు. ఆచార్య మూవీలో రామ్‌చరణ్‌ బాస్‌ అని, చిరంజీవి టెర్రిఫిక్‌గా కనిపించారని ప్రశంసించాడు. ఈ సినిమాలో చరణ్‌ తన పాత్రతో స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడని మెచ్చుకున్నాడు. మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో లెవల్‌లో ఉందన్నాడు.

ఈ రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'బాబూ, అది చిరంజీవి సినిమారా, అందులో చరణ్‌ అతిథి పాత్ర, తమరేమో చరణే బాస్‌ అంటున్నారు, ఇంతకీ సినిమా చూశారా? లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఈయన ప్రతి సినిమాకు నాలుగు స్టార్ల రేటింగ్‌ ఇస్తాడు, ఇది మామూలేగా' అని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం 'మీరు చెప్పింది నిజమైతే బాగుండు', 'చరణ్‌, చిరంజీవి గురించి పాజిటివ్‌గా చెప్పినందుకు థ్యాంక్స్‌' అని కామెంట్లు పెడుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్‌ చేయకపోతే పవన్‌కల్యాణ్‌ చేసేవాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement