first review
-
ఆచార్య ఫస్ట్ రివ్యూ: రామ్‌చరణే బాస్! మరి చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఆచార్య సినిమా అదుర్స్ అంటూ అప్పుడే ఓ రివ్యూ బయటకు వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఆచార్య చూసేశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రానికి నాలుగు స్టార్ల రేటింగ్ కూడా ఇచ్చాడు. ఆచార్య మూవీలో రామ్‌చరణ్ బాస్ అని, చిరంజీవి టెర్రిఫిక్‌గా కనిపించారని ప్రశంసించాడు. ఈ సినిమాలో చరణ్ తన పాత్రతో స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడని మెచ్చుకున్నాడు. మూవీలో ఎంటర్టైన్మెంట్ మరో లెవల్లో ఉందన్నాడు. ఈ రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'బాబూ, అది చిరంజీవి సినిమారా, అందులో చరణ్ అతిథి పాత్ర, తమరేమో చరణే బాస్ అంటున్నారు, ఇంతకీ సినిమా చూశారా? లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఈయన ప్రతి సినిమాకు నాలుగు స్టార్ల రేటింగ్ ఇస్తాడు, ఇది మామూలేగా' అని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం 'మీరు చెప్పింది నిజమైతే బాగుండు', 'చరణ్, చిరంజీవి గురించి పాజిటివ్‌గా చెప్పినందుకు థ్యాంక్స్' అని కామెంట్లు పెడుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) First Review #Acharya ! #RamCharan is the boss, when it comes to playing to the masses. This film reaffirms this truth. The role provides him ample opportunity to prove his star power and he does it with remarkable ease. #Chiranjeevi is in Terrific form as well. ⭐️⭐️⭐️⭐️ — Umair Sandhu (@UmairSandu) April 26, 2022 చదవండి: ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చరణ్ చేయకపోతే పవన్‌కల్యాణ్ చేసేవాడు -
‘బాహుబలి 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
ముంబై: ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది. ముంబైలో ఈరోజు రాత్రి బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రీమియర్ వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్ఏ’ పత్రికతో చెప్పారు. ‘మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. సింగిల్ ఫ్రేమ్, షాట్, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్ చేయలేదు. ఒక్క కట్ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. దీని గురించి నేను వెల్లడించను. ఈసారి ఇద్దరూ సమానంగా ఆకట్టుకుంటార’ని వివరించారు. -
రూపాయికి పాలసీ రివ్యూ జోష్!
ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ బాగా పుంజుకుంది. కీలక వడ్డీరేట్టు తగ్గనున్నాయనే అంచనాలతో 36పైసలు పైకి ఎగబాకింది. డాలర్ మారకపువిలువలో రూపాయి రూ. 68 స్థాయి నుంచి పుంజుకుంది. బుధవారం ఆరంభంలో 12 పైసల లాభంతో రూ. 67.78 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 8 పైసల లాభంతో రూ. 67.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం తర్వాత అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ కు బాగా డిమాండ్ పుట్టింది. దీంతో ప్రపంచ కరెన్సీలు పతనమయ్యాయి. దీంతో రూపాయి కూడా రూ.68 దిగువకు పతనమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ తర్వాత మొదటి సారి ఆర్ బీఐ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రెండురోజులు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) సమీక్ష విధానాన్ని ప్రకటించనున్నారు. 0.25 -0.50 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆరేళ్ల కనిష్టానికి కీలక వడ్డీరేట్లు చేరనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి బలహీనపడ్డాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా ధరలకు బూస్ట్‌నివ్వాలని భావించినప్పటికీ ట్రేడర్లు చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తుండటంతో చమురు ధరలు క్షీణిస్తున్నాయి. ఏఏ దేశాలు ఎంతమేర ఉత్పత్తిలో కోత పెట్టేదీ స్పష్టతలేదని, ఒప్పందానికి ఎన్ని దేశాలు కట్టుబడేదీ కూడా అనుమానమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు స్వదేశీ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు కూడా బలహీనంగానే కదులుతున్నాయి. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం
- జిల్లా అభివృద్ధిపై తొలి సమీక్ష - ప్రభుత్వ పథకాలు, సమస్యలపై విసృ్తత స్థాయిలో చర్చ - ఇక ప్రతి నెలా సమీక్ష సమావేశాలు - ఎమ్మెల్యేలకు చెప్పిచేయమని అధికారులకు మంత్రి గంటా ఆదేశం - ఈ నెల 28న అరకులో సంక్షేమ శిబిరానికి సీఎంకు ఆహ్వానం -13న విశాఖ, 14న అనకాపల్లిలో వికలాంగుల శిబిరాలకు కేంద్ర మంత్రి రాక విశాఖపట్నం : ప్రభుత్వం కొలువైన పది నెలలకు తొలిసారిగా విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై ప్రజాప్రతినిధులు సమీక్ష జరిపారు. రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంపీలు కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, 12 మంది ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లపై అధికారులను నిలదీశారు. హుద్‌హుద్ తుపాను సాయం, పింఛన్లు, విద్య, వైద్య, వ్యవసాయ శాఖలపై సమీక్ష జరిపారు. అధికారుల వైఫల్యాలను తీవ్రంగా తప్పుబట్టారు. పథకాల లోటుపాట్లను సరిదిద్దుకుని వాటిని అర్హులైన వారికి అందించడం, పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం కోసం ఇక ప్రతినెల చివరి శుక్రవారం ఇటువంటి సమీక్షలు జరపనున్నట్లు మంత్రి గంటా ఈ సందర్భంగా ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు ఒకేచోట అందించేలా ఈ నెల 28న అరకులో భారీ సంక్షేమ శిబిరాన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, 14న అనకాపల్లి ఎన్టిఆర్ స్టేడింయంలో వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. ఈ శిబిరాలకు కేంద్ర మంత్రి అశోక్ గెహ్లట్ హాజరవుతారన్నారు. నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలకు తెలియజేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించాల్సిందిగా అధికారులకు గంటా ఆదేశాలిచ్చారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పినపుడు తక్షణమే స్పందించాలన్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఎంపీ హరిబాబు సూచించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలో ప్రభుత్వం మల్టీ ఛానల్ డెలివరీ సిస్టంను ప్రవేశపెట్టనుందని, జిల్లాలో ఓ మండలంలో వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. దీని వల్ల పింఛన్ దారులు తాము ఏ విధంగా పింఛన్ పొందాలనుకుంటున్నారనే ఆప్షన్ ఆ విధంగానే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకు, పోస్టాఫీసు, రేషన్ షాపులో పింఛన్లు చెల్లించేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యార్ధులను చేర్చుకునే కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటర్మీడియెట్ అధికారులకు సూచించారు. ఏజెన్సీలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పాఠశాలల మరమ్మతులకు ఇంకా నిధులు విడుదల కాలేదని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు అన్నారు.యుపి స్కూల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు.జిల్లాలో 156 పాఠశాలల మరమ్మతులకు రూ.8.52కోట్లు మంజూరైనట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ నగేష్ తెలిపారు. ఈ సమస్యపై నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.తగిన ప్రతిపాదనలు ఇస్తే ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని ఎంపీ హరిబాబు చెప్పారు. కాఫీ తోటలు, ఇతర ఉద్యానపంటల పరిహారం చెల్లింపులో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని, విద్య, వైద్య శాఖలతో ఇబ్బందులు ఉన్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు. మధ్యాహ్న భోజన పధకం బిల్లుల బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించారు.నిధులు విడుదలయ్యాయని నాలుగైదు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి బదులిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాల భవనాల నిర్మాణంలో సమస్యలు ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని బోధకులుగా నియమించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. కోళ్ల పరిశ్రమకు సంబంధించి అర్హులకు ఇంత వరకూ తుపాను సాయం అందలేదని, అనర్హుల పేర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చారని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్నారు. బోట్లకు కూడా నష్టపరిహారం అందాల్సిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దర్ఘటన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు తమ నియోజకవర్గ సమస్యలను వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, అధికారులు పాల్గొన్నారు.