ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్‌ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం | Acharya: Second Single Release Release On November 5 Chiranjeevi Ram Charan Starrer | Sakshi
Sakshi News home page

Acharya Second Single Release: ఫ్యాన్స్‌కి దీపావళి ట్రీట్‌ ఇవ్వనున్న ‘ఆచార్య’ టీం

Published Tue, Nov 2 2021 4:05 PM | Last Updated on Tue, Nov 2 2021 4:19 PM

Acharya: Second Single Release Release On November 5 Chiranjeevi Ram Charan Starrer - Sakshi

Acharya Second Single Release: సైరా నరసింహారెడ్డి తరువాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు.  ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్‌ నటించగా, మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే అలరించనున్నారు. ఫ్యాన్స్‌కి దివాళి ట్రీట్‌గా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగల్‌ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.


ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన ఫస్ట్‌ సింగిల్ 'లాహే లాహే' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డాన్స్‌లో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గకుండా చిరు స్టెప్స్‌ ఈ పాటలో ఉన్నాయి. దీంతో ప్రతేక్యంగా చిరు అభిమానులకు ఈ పాట విపరీతంగా నచ్చిందని చెప్పాలి. తాజాగా ఆచార్య చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా చరణ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించిన 'నీలాంబరి' గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ విడుదల చేశారు.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గతంలో చిరూ - మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

చదవండి: Chiranjeevi Hallowen Look: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్‌.. షాక్‌లో అభిమానులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement