లాక్‌డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చి రీఫేస్ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, దర్బార్‌లో రజినీకాంత్ సల్మాన్‌ఖాన్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది.
తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ‘ఆచార్య’గా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ను రీఫేస్ యాప్‌తో ఛేంజ్ చేసి చిరంజీవి డైలాగ్స్‌ని డేవిడ్ వార్నర్ చెప్పినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆచార్య విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment