ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా.. | Ram Charan Enters In Acharya Movie Sets | Sakshi
Sakshi News home page

ఆచార్య క్రేజీ అప్‌డేట్‌: సిద్ధ ఆగయా..

Published Sun, Jan 17 2021 10:46 AM | Last Updated on Sun, Jan 17 2021 7:43 PM

Ram Charan Enters In Acharya Movie Sets - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, ఆయన తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సెట్స్‌లో రామ్‌చరణ్‌ అడుగు పెట్టారట. ఎప్పటిలాగే షూటింగ్‌ చూడటానికి వచ్చారనుకోకండి.. తనకిచ్చిన పాత్రలో జీవించేయడానికి వచ్చారట. ఈ మేరకు డైరెక్టర్‌ కొరటాల శివ.. ఆచార్య సెట్స్‌లోకి స్వాగతం రామ్‌చరణ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించారు. దీంతో మొత్తానికి రామ్‌చరణ్‌ మీద షూటింగ్‌ ప్రారంభమైనట్లు క్లారిటీ వచ్చేసింది. (చదవండి: ‘ఆచార్య’ టెంపుల్‌ సెట్‌పై చిరు ఆసక్తికర ట్విట్‌)

అలాగే ముందుగా అనుకున్నట్లుగా కాకుండా సినిమాలో ఆయన నిడివిని కూడా పెంచినట్లు సమాచారం. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను తేజ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. రిలీజ్‌ డేట్‌ విషయానికి వస్తే.. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న థియేటర్లలోకి వచ్చి, బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కాబట్టి ఆ సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను కూడా ఆ లక్కీడేట్‌ నాడే రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రబృందం. (చదవండి: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో నాగ్‌ సందడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement