
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ సినిమా సూపర్ హైబడ్జెట్ కేటగిరీ కిందకు వస్తోంది. దాంతో ఆ సినిమా నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సినిమా విడుదల నాటి నుంచి పది రోజుల పాటు టికెట్‌పై రూ.50 పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment