Chiranjeevi: RAm Charan Acharya Movie New Release Date Out,Deets Inside - Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1.. మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కు పండగే

Jan 16 2022 10:33 AM | Updated on Jan 16 2022 11:11 AM

Acharya Movie New Release Date Out - Sakshi

ఏప్రిల్‌ 1.. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు పండగే.

ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ‘ఆచార్య’మూవీని వాయిదా వేయక తప్పడం లేదని శనివారం చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అయితే మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 1న ‘ఆచార్య’మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement