‘ఆచార్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు తర్వాతి సినిమా చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారట చిత్రదర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా కాకుండా బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వాల్లో కూడా చిరంజీవి హీరోగా సినిమాలు తెరకెక్కనున్నాయి. సెట్స్‌లో ఒక సినిమా, కమిట్ అయిన మూడు సినిమాలతో చిరంజీవి బ్రేక్ లేకుండా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment