
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పన్లో పనిగా ఆచార్యను కూడా రిలీజ్‌కు రెడీ చేశారు ఆ చిత్ర బృందం. ‘ఆర్ఆర్ఆర్’తో రామరాజు పాత్ర ద్వారా చరణ్ అదరకొట్టిన విషయం తెలిసిందే.
ఇక చిరంజీవి హీరోగా నటించిన ఆచార్యలో చెర్రీ కీలక పాత్ర పోషించాడు. ‘ఆర్ఆర్ఆర్’ సూపర్ సక్సెస్ కావడంతో ఆచార్యపై హోప్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతానికి ఆచార్య నుంచి ఒక టీజర్, రెండు పాటలు మాత్రమే విడుదలయ్యాయి.
కాగా సినిమాలో చిరంజీవి-రామ్ చరణ్ కాంబోలో ఒక పాట కూడా చిత్రీకరించారని సమాచారం. ఆ పాట ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అంటుంది మెగా కాంపౌండ్. మూడు గంటల రన్‌టైమ్‌తో ఆచార్య ఫైనల్ కాపీ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఆచార్య చిత్ర బృందం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక దాని తరువాత శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు చెర్రీ. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment