
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరు, రామ్ చరణ్ ప్రమోషన్స్ షురు చేశారు. తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ తన తండ్రితో కలిసి 'ఆచార్య'లో నటించిన అనుభవాలను పంచుకున్నాడు. తాను ఈ చిత్రంలో నటించడమే కాదు షూటింగ్ జరుగుతున్నంత కాలం ప్రతి నిమిషం తన తండ్రి చిరంజీవితో కలిసి ఉండటం తనకు చాలా భావోద్వేగపూరితమైనదని చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాకూ, డాడీకి షూటింగ్‌కి వీలుగా ఉండేలా ఒక డబుల్‌బెడ్రూం ఇంటిని ఇచ్చారు. అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ చేశాం. రోజూ కలిసి షూటింగ్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యేవాళ్లం. అలానే సెట్స్‌లో ఇద్దరం కలిసి పని చేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్‌లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను.
ఇక నాకు ఇలా ఉంటే నాన్న అక్కడ ఓ రోజు చరణ్ నీకు అర్ధం కావడం లేదేమో దీని వాల్యూ. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. 'ఆచార్య' వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. షూటింగ్‌కి ముందు లేదా తరువాత ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా 'ఆచార్య' చిత్రం తమకు చాలా స్పెషల్ అంటూ తన తండ్రి చిరంజీవిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఇక రామ్ చరణ్ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే దర్శకుడు శంకర్‌తో చేస్తున్న చిత్రంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టి జెట్‌స్పీడ్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు చెర్రి.
Comments
Please login to add a commentAdd a comment