ఆచార్య: రామ్‌ చరణ్‌కు జోడీ కుదిరింది | Pooja Hegde May Romance With Ram Charan In Chiranjeevi Acharya | Sakshi
Sakshi News home page

ఆచార్య: రామ్‌ చరణ్‌కు జోడీగా బుట్ట బొమ్మ

Published Mon, Jan 25 2021 5:52 PM | Last Updated on Wed, Jan 27 2021 1:57 PM

Pooja Hegde May Romance With Ram Charan In Chiranjeevi Acharya - Sakshi

'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌  జరుపుకొంటున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆచార్య సెట్స్‌లోకి చరణ్‌  ఇటీవలే అడుగు కూడా పెట్టేశాడు. ఈ మేరకు డైరెక్టర్‌ కొరటాల శివ.. ఆచార్య సెట్స్‌లోకి స్వాగతం రామ్‌చరణ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ ఆయన పాత్ర పేరును కూడా వెల్లడించారు. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ అంతకంతకూ ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించబోతోందని తెలుస్తోంది. మొదట రష్మిక మందన్నను అనుకున్నప్పటికీ తనకు డేట్స్ కుదరకపోవడంతో పూజాను సంప్రదించారట.. దీనికి వెంటనే  ఒప్పుకున్న బుట్టబొమ్మ ఈ ప్రాజెక్టుపై సంతకం కూడా చేసిందట. ఇక నెక్స్ట్‌ షెడ్యూల్‌లో పూజా సెట్స్‌లోకి అడుగు పెట్టనుంది. చరణ్-పూజా హెగ్డే షూట్ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పూజా హెగ్డేపై ఓ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీ చిత్రీకరణ త్వరగా పూర్తిచేసి సమ్మర్ బరిలో నిలపాలని చూస్తోంది యూనిట్. అంతేగాక ఈ చిత్రం టీజర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. చదవండి: ఆ హీరోయిన్‌ కావాలంటున్న త్రివిక్రమ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement