Chiranjeevi's Acharya Movie Trailer to released in 152 theaters, Deets Inside - Sakshi
Sakshi News home page

Acharya Movie Trailer: 'మెగా' ఫ్యాన్స్‌కు 'ఆచార్య' ట్రీట్‌.. 152 థియేటర్లలో హంగామా..

Published Mon, Apr 11 2022 8:20 PM | Last Updated on Tue, Apr 12 2022 11:12 AM

Chiranjeevi Acharya Trailer Release In 152 Theatres - Sakshi

Chiranjeevi Acharya Trailer Release In 152 Theatres: మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది 'ఆచార్య' చిత్రబృందం. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం 'ఆచార్య' కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌ను పెంచిన చిత్ర బృందం ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం ఖరారు చేసి అభిమానులకు ఒక శుభవార్త తెలిపింది. ఆచార్య ట్రైలర్‌ను సోషల్ మీడియాతోపాటు వెండితెరపై కూడా ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. 

చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో 'ఆచార‍్య' ప్రచార చిత్రాన్ని ప్రదర్శించబోతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్‌ హంగామా చేయనుంది. ఏప్రిల్‌ 12న సాయంత్రం 5:49 గంటలకు ఈ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనువిందు చేయనున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.

చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్‌ ఎంతంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement