
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఆ మూవీ రిలీజ్ డేట్‌పై ఇప్పటి వరకు సస్పెన్స్ నెలకొంది. మొదట ఆచార్యను డిసెంబర్ 24న కొరటాల శివ విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆర్‌ఆర్‌ఆర్ జనవరి 7న విడుదలవుతుండటంతో తన రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.
దీంతో డిసెంబర్ 17 ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే ఆ రోజే పుష్ప రిలీజ్ కావడంతో ఆచార్య విడుదల తేదీ చర్చనీయాంశమైంది. ఇక దీనిపై చర్చ జరిపిన మూవీ టీం తాజాగా కొత్త తేదీని ఖరారు చేసి ప్రకటించారు. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రామ్ చరణ్ ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చెర్రి సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
#Acharya Arrives on 4th Feb22@KonidelaPro @MatineeEnt @KChiruTweets #SivaKoratala pic.twitter.com/VeE9p7PLrg
— Ram Charan (@AlwaysRamCharan) October 9, 2021