Acharya Movie Bhale Bhale Banjara Song Release on April 18th - Sakshi
Sakshi News home page

Acharya: అక్కడ చూసుకుందాం.. రామ్‌చరణ్‌కు చిరంజీవి సవాల్‌

Published Sat, Apr 16 2022 5:48 PM | Last Updated on Sat, Apr 16 2022 6:07 PM

Acharya Movie: Bhale Bhale Banjara Song Release Date Out - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆచార్య’. రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్‌ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌. తాజాగా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. 

అందులో రామ్‌ చరణ్‌కి చిరంజీవి సవాల్‌ విసిరాడు. ‘భలే భలే బంజారా’సాంగ్‌కి సెట్‌లో ఎవరెలా స్టెప్పులేస్తారో చూసుకుందాం అని చాలెంజ్‌ విసిరాడు. కొరటాల శివ ఈ పాట గురించి చెబతూ.. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారని చెప్పాడు. సాంగ్‌ వినిపించి ఏంటి సార్‌ పరిస్థితి అని కొరటాల అడగ్గా..‘రేపు నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. మీ సాంగ్‌ చాలా బాగుంది. మణి(మణిశర్మ) ఏమో థియేటర్లలో ఊగదంపుడు, కొట్టి అవతల పడేశాడు. రేపు మాత్రం మేము సెట్స్‌లో ఎలా చేయాలో అనే టెన్షన్‌ నాకుంది’అని చిరంజీవి అన్నారు.

మీరే అలా అంటే ఎలా సర్‌ అని కొరటాల అనగా.. ‘మాములుగా అయితే అలా అనను. రేపు పొద్దున చరణ్‌తో ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘నాటు నాటు’పాటకు తారక్‌, చరణ్‌ అదగొట్టేశారు. ఇప్పుడు ఆ అంచనాలను అందుకోవాలంటే..కాస్త టెన్షన్‌గా ఉంది’ అని చిరంజీవి అనగా.. మేం ఎంత నాటుగా చేసిన ఆయన(చిరంజీవి)వచ్చి ఆయన గ్రేస్‌తో, ఎక్స్‌ప్రెషన్‌తో ఎక్కడా డామినేట్‌ చేస్తారో అని నా డౌట్‌’అని చరణ్‌ అన్నాడు. ఇక చివరల్లో ఇద్దరు చిరంజీవి..‘హేయ్‌ చరణ్‌.. ఏంటి సాంగ్‌ని డామినేట్‌ చేద్దామని చూస్తున్నావా? నీ బాబుని రా నేను’అని చిరు అంటే..లేదు డాడీ.. డామినేట్‌ చేయను..బట్‌ తగ్గను’అన్నాను. ఇక్కడ కాదు సెట్‌లో చూసుకుందాం’అని చిరంజీవి సవాల్‌ విసిరి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది.  తండ్రి కొడుకులు కలిసి స్టెప్పులేసే ఈ పాట ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement