![Here Is The Reason Behind Kajal Aggarwal Silence On Acharya - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/29/kajal.jpg.webp?itok=HRGKCxK5)
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషించాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. చిరంజీవి సరసన కాజల్‌ను తీసుకుని, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపారు. కానీ ట్రైలర్‌లో మాత్రం ఆమెను చూపించకపోవడంతో ప్రేక్షకులకు అనుమానం పుట్టుకొచ్చింది. కాజల్ కనిపించకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీనికి కొరటాల శివ స్పందిస్తూ.. కాజల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతోనే ఆమెను తీసేసినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగుండదని, అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదనిపించే సినిమాలో నుంచి తొలగించామని తెలిపాడు.
అతడు చెప్పిన సమాధానంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. కొంత షూటింగ్ జరిపాక తనను ఎలా తీసివేస్తారని ప్రశ్నించారు. దీనిపై కాజల్ ఇప్పటివరకూ స్పందించనేలేదు. నిజానికి ఈ సినిమాలో నటించనప్పటికీ కాజల్ తన పారితోషికాన్ని పూర్తిగా అందుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు కోటిన్నర రూపాయలు తీసుకుంది కాబట్టే ఆచార్య నుంచి తప్పించినా సైలెంట్‌గా ఉండిపోయిందని అంటున్నారు.
చదవండి: ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..
మహేశ్‌బాబు బ్లాక్‌బస్టర్ మూవీ 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్
Comments
Please login to add a commentAdd a comment