
‘ఆచార్య’ షూటింగ్ కోసం మారేడుపల్లికి బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవికి రాజమండ్రి- మధురపూడి ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. చిరు రాక సమాచారం తెలుసుకున్న మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన కి బయలుదేరిన చిరంజీవి.. అభిమానులకు అభివాదం చేస్తూ ఏజెన్సీలో జరగనున్న షూటింగ్‌కు ర్యాలీగా వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ క్రమంలో మారేడుమిల్లిలో షూటింగ్ ను షెడ్యూల్ చేశారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు మారేడుమిల్లిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో ఆచార్య షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే.
చదవండి :
ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్
Comments
Please login to add a commentAdd a comment