
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ మూవీ నుంచిఆ మధ్య ‘లాహే..లాహే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు.
ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అదించారు. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యాబ్‌లో 50 మిలియన్ల మార్క్ దాటింది. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే మే 13న సినిమా విడుదల కావాల్సిఉంది.