Megastar Chiranjeevi Acharya Movie Shooting Shedule Completed In Rajahmundry And Yellandu - Sakshi
Sakshi News home page

ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఆచార్య

Published Wed, Mar 10 2021 7:22 PM | Last Updated on Wed, Mar 10 2021 8:13 PM

Acharya Completed Long Schedule In Rajahmundry, Yellandu - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌. ఇతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన రాజమండ్రి, ఇల్లందుల షెడ్యూల్‌ పూర్తి కావడంతో చిరు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు.

అయితే అక్కడ తీవ్రమైన ఎండలకు చిరు ఉక్కిరిబిక్కిరి అయ్యాడని, దీంతో డీహైడ్రేషన్‌కు గురైన ఆయన షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్‌ చెప్పనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్లను చిత్రయూనిట్‌ కొట్టిపారేసింది. చిరంజీవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని స్పష్టం చేసింది. ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్‌ను సైతం విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. నెల రోజుల షూటింగ్‌లో చిరంజీవి, చరణ్‌ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 13న విడుదల కానుంది. కాగా ఆచార్య షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టగానే చిరంజీవి నెక్స్ట్‌ లూసిఫర్‌ రీమేక్‌ చిత్రీకరణలో భాగం కానున్నాడు.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement