Audience Review
-
'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే..
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఉండటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమా ఎట్టకేలకు శుక్రవారం(ఏప్రిల్29)విడుదలయ్యింది. ‘సైరా నరసింహారెడ్డి’లాంటి సూపర్‌హిట్ తర్వాత సుమారు 4ఏళ్ల తర్వాత చిరు నటించిన సినిమా కావడం, రామ్‌చరణ్ కూడడా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమాపై వాళ్ల రివ్యూ ఏంటన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో తెలుసుకుందాం. -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'కేజీఎఫ్-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ
కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సీక్వెల్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కేజీయఫ్ 2' అనే చెప్పవచ్చు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది.. కేజీఎఫ్ సీక్వెల్‌గా రూపొందిన `కేజీఎఫ్ ఛాప్టర్2`గురువారం(ఏప్రిల్14)న ప్రేక్షకుల మందుకు వచ్చింది. స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. మరి ఈ చిత్రం 'కేజీఎఫ్' రేంజ్లో సక్సెస్ సాధించిందా? లేక అంతకుమించి ఆకట్టుకుందా? `కేజీఎఫ్ ఛాప్టర్2`పై ఆడియెన్స్ ఓపీనియన్ ఏంటి అన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూలో తెలుసుకుందాం. -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ
Audience Review On Vijay Beast Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన విలక్షణమైన నటనతో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా 'ఇళయదళపతి' అని పిలుచుకుంటారు. సందేశాత్మకంగా, వైవిధ్యంతో ఉన్న భిన్నమైన సినిమాలు చేస్తుంటాడు విజయ్. అందుకే విజయ్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో సైతం అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే వాళ్లందరికి పండగే. ఈసారి భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న రిలీజైంది విజయ్ 'బీస్ట్' మూవీ. 'కోకోకోకిల', 'వరుణ్ డాక్టర్' వంటి చిత్రాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, అరబిక్ కుతు సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో 'బీస్ట్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'బీస్ట్' వీక్షకులను ఎంతమేరకు మెప్పించిందో 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూ ఏంటో తెలుసుకుందామా ! -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ప్రేక్షకులు...
పారిస్: టెన్నిస్ వీరాభిమానులను ఉత్సాహపరిచేలా ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్ఎఫ్టీ) ఓ కీలక ప్రకటన చేసింది. యూఎస్ ఓపెన్ మాదిరిగా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్టీ అధ్యక్షుడు బెర్నార్డ్ జుడిషెల్లీ గురువారం ప్రకటించారు. ‘కచ్చితంగా ఇది ప్రేక్షకులు లేకుండానైతే జరుగదు. కానీ ఎంతమంది ప్రేక్షకుల్ని ఆహ్వానించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అధికారులతో మాట్లాడిన తర్వాతే ప్రేక్షకుల సంఖ్యపై స్పష్టత వస్తుంది. జూన్ చివర్లో గానీ జూలై ప్రారంభంలో గానీ టిక్కెట్లు అందుబాటులో ఉంచుతాం’ అని ఆయన పేర్కొన్నారు. జూన్‌లో వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పుడు సెప్టెంబర్ 27నుంచి జరుగుతుంది. ఆగస్టు 14తో సీజన్ షురూ... కరోనా కారణంగా మార్చిలో నిలిపివేసిన ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నీల పునరుద్ధరణకు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సిద్ధమైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్), యూఎస్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ), ఎఫ్ఎఫ్టీల సహకారంతో సవరించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. రీషెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ముందు అనుకున్నట్లుగా అగస్టు 31నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుండగా... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. వాషింగ్టన్ డీసీ వేదికగా ఆగస్టు 14నుంచి జరుగనున్న సిటీ ఓపెన్ ఏటీపీ 500 టూర్‌తో టెన్నిస్ సీజన్ ప్రారంభం కానుంది. అనంతరం వరుసగా ఆగస్టు 22 నుంచి వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ (సిన్సినాటి వేదిక), ఆగస్టు 31 నుంచి యూఎస్ ఓపెన్ (న్యూయార్క్), సెప్టెంబర్ 8 నుంచి జనరలి ఓపెన్ (కిచ్బుహెల్), 13 నుంచి ముతువా మాడ్రిడ్ ఓపెన్ (మాడ్రిడ్), 20 నుంచి ఇంటర్నేషనల్ బీఎన్ఎల్ డి ఇటాలియా (రోమ్), 27 నుంచి రోలాండ్ గారోస్ (పారిస్) టోర్నమెంట్లు జరుగనున్నాయి. -
'కిక్-2లో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అట'
హైదరాబాద్: కిక్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి ఆ కంఫర్ట్ మజాను అందించడానికి రెడీ అయ్యాడు. కిక్ సినిమా సీక్వెల్‌గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వాళ్లు కథ బాగుందని ముఖ్యంగా బ్రాహ్మనందంతో కామెడీ హైలైట్ అంటున్నారు. సినిమాలో పాటలు అద్బుతంగా ఉన్నాయంటున్నారు. మరోవైపు మంచి కథతో రచయితలు ముందుకు వస్తే కిక్-3 తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'వ్యాపారం కోసం కాదు...నిజంగానే చక్కటి కథ, మంచి టీమ్‌తో ఎవరైనా తనను సంప్రదిస్తే' కిక్ సీక్వెల్ లో నటిస్తానని మాస్ మహారాజ స్పష్టం చేశాడు. కిక్ 3 చేయడానికి తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. కిక్ 3 సినిమా తీస్తే వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నాడు. ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కూడా కావాలని రవితేజ అభిప్రాయపడ్డాడు. తెలుగులో కిక్ సినిమా అందించిన విజయోత్సాహంతో దూసుకుపోతున్న ఈ మాస్ మహారాజా ఆ మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరని చెప్పకనే చెబుతున్నాడు.