లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి.. | Attempt To Assault On Young Woman In Srikakulam District | Sakshi
Sakshi News home page

లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి..

Published Wed, Mar 16 2022 1:24 PM | Last Updated on Wed, Mar 16 2022 2:27 PM

Attempt To Assault On Young Woman In Srikakulam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీకాకుళం రూరల్‌: సింగుపురం పంచాయతీ దేవాంగుల వీధికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన పి.చిన్నారావు ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్‌ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా పని చేసుకుంటున్న యువతిని గ్రామంలోని జూట్‌మిల్‌లో పనిచేస్తున్న చిన్నారావు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు.
చదవండి: ఫేస్‌బుక్‌ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్‌

తనకు లొంగకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో 12వ తేదీ రాత్రి శ్రీకాకుళం టౌన్‌కు పనిమీద వెళ్లిన యువతి తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల సమయంలో సింగుపురం వద్ద గల కొండమ్మ తల్లి చెరువు వద్ద బస్సు దిగింది. అక్కడే కాపుకాసిన చిన్నారావు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయతి్నంచాడు. ఇంతలో జాతీయ రహదారి మీదుగా పలాస వెళ్తున్న ఓ వ్యాన్‌లోని వ్యక్తులు గమనించి ఆమెను కాపాడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement