సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ మహిళలకే కాకుండా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మహిళలకు కూడా అత్తింటివారి వేధింపులు తప్పట్లేదని కొన్ని సంఘటనలు రుజువు చేసిన విషయం తెలిసిందే. అలాంటిదే తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి మాత్రం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తనకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే గుర్గావ్‌లోని సెక్టార్ 49లో ఉంటున్న ఓ గృహిణి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె 2016, జూలై 21న రజ్నీష్ గులాటి అనే ఢిల్లీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆయన ముదిత్ విశ్వకర్మ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె గర్భం దాల్చగా తన కడుపులో పెరుగుతుందని ఆడ బిడ్డ అని వెంటనే అబార్షన్ చేసుకోవాలని భర్త దాడి చేశాడు. తన అత్త, మామ, ఆడబిడ్డ అందరూ కలిసి తనను ఇంట్లో నుంచి ఈడ్చి పడేశారని తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
విదేశాంగ వ్యవహారాలశాఖ ఉద్యోగినికీ అత్తింటిపోరు
Published Sat, Dec 30 2017 11:23 AM | Last Updated on Sat, Dec 30 2017 11:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment